
– విజేతలకు బహుమతులు ప్రధానం
నవతెలంగాణ – తాడ్వాయి
ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటాపుర్ లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్, సీఐటీయూ ములుగు జిల్లా కార్యదర్శి కురెందుల సమ్మక్క మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని, మహిళా అభివృద్ధితోనే కుటుంబాలు బాగుపడతాయని చెప్పారు. మహిళలు ఆత్మ రక్షణ కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి సమస్య ఏదైనా మహిళలు ధైర్యం గా ఎదుర్కోవాలని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరిత, నిర్మల, సుజాత, జయమ్మ, శ్రీకళ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.