నవతెలంగాణ తాడ్వాయి: మహిళ కుటుంబం నుంచి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో రామస్వామి మాట్లాడుతూ.. మహిళ కుటుంబం నుంచి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఎందరో వీర వనితల యొక్క స్ఫూర్తిని ఆధారం చేసుకుని నేడు మహిళలు ఆయా రంగాలలో విశిష్టమైన ప్రగతిని సాధిస్తూ పురుషులకు దీటుగా అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నందుకు గర్వపడాలన్నారు. మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని సమాజసేవకు అంకితం కావాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులైన నివేదిత, శ్వేత, సుజాత, వాణిశ్రీ, సుమలత, శ్రీ లౌక్యలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి మరియు ఉపాధ్యాయులు గిర్మాబోయి (గిరి), గంగాధర్, రమేష్, సత్యనారాయణ, బాపూరావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.