భండారు విజయ… స్త్రీ సమస్యలను చూసి ఆవేదన చెందినపుడు రచయితగా తన కలానికి పని చెబుతారు. స్త్రీ ఎక్కడైనా అన్యాయానికి గురైతే ఓ హక్కుల నేతగా తన గొంతు విప్పుతారు. మహిళా రచయిత్రుల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సంపాదకురాలిగా ఆ బాధ్యతలు తన భుజాలకెత్తు కుంటారు. అంతేకాదు జంట నగరాల్లో ఉన్న రచయిత్రులతో ‘హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం’ ప్రారంభించి ఎంతో మందిని ఒక సమూహంగా చేశారు. ఇటీవల 53 మంది రచయిత్రులు రాసిన మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలను ‘యోధ’ రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన ఆమెతో మానవి సంభాషణ…
మీ పరిచయం చెప్పండి? మీరు ఎప్పటినుండి రాయడం మొదలు పెట్టారు?
వరంగల్‌లో పుట్టిపెరిగాను. 6వ తరగతి నుండే కవితలు రాస్తుండేదాన్ని. అందుకు కారణం మా ఇంట్లో సాహిత్య వాతావరణం, సోషలిజ భావజాలం ఉండడం. మా నాన్న శివతత్వాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు పాడుతుండేవారు. అవి వినీ వినీ సమానత్వ ధోరణి అలవడింది. మా అమ్మ చెప్పే పురాణ గాథల వల్ల ప్రశ్నించే తత్వం అలవడింది. పెద్దబాలశిక్ష, పేదరాశి పెద్దమ్మ, పంచతంత్రం, చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బుజ్జాయి లాంటి పుస్తకాలతో నాలో ఊహాశక్తి జనించింది. దాంతో నా తమ్ముళ్ళకు రోజూ రాత్రి పడుకునేటప్పుడు కథలు కల్పించి చెప్పడం నేర్చుకున్నాను. నేను రాసిన మొదటి కథను మా తెలుగు మాష్టారుకు చూపిస్తే, ఆయన మెచ్చుకొంటూ ‘ముందు చిన్న చిన్న పదాలతో కవితలు, పద్యాలు రాయి. ఆ తర్వాత ఇంతకన్నా బాగా వాక్య నిర్మాణం వస్తుంది. అప్పుడు కథలు బాగా రాయవచ్చు’ అన్న మాటలు నాపై ప్రభావం చూపాయి.
ఇప్పటి వరకు మీ నుంచి వెలువడిన రచనల గురించి చెప్పండి?
మూడు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, రెండు కథా సంపుటాలు, ఆరు పుస్తకాలకు సహ సంపాదకత్వం, నా సొంత ప్రచురణలతో రెండు కథల సంకలనాలు వచ్చాయి.
సొంత సంపాదకీయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
విద్యార్ధిదశ నుంచి కవిత్వం ఎక్కువగా రాసేదాన్ని. ప్రసారిక లాంటి పత్రికల్లో అవి ప్రతి వారం అచ్చయ్యేవి. అలాగే వరంగల్ వాణిలో కూడా వినిపించేదాన్ని. 1984లో నా మొదటి కవితా సంపుటి ‘దీపిక’ను నా మిత్రులు ‘సాహితీ సంస్కృతి వేదిక’ పేరు మీద ప్రచురించారు. అప్పుడే మిత్రబృందం సపోర్టుతో ఓ ప్రచురణ సంస్థ ఏర్పాటు చేయాలనుకున్నాను. అప్పుడే ‘శ్రీలేఖ సాహితి ప్రచురణల’ పేరుతో మాకు అత్యంత ఆప్తుడైన డా.టి.శ్రీరంగస్వామి ఏర్పాటు చేశారు. పెండ్లి తర్వాత హైదరాబాద్ రావడంతో చాలా కాలం సాహిత్యానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2000ల వరకు రచనలు చేయడమే మానేశాను. మిత్రుల ప్రోత్సాహంతో మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. ఆ సమయంలో వరంగల్లు మిత్రులతో కలిసి 2011లో ఓ ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంస్థ ద్వారా కొన్ని సంకలనాలకు సహ సంపాదకత్వం వహించాను. 2016లో ‘హస్మిత ప్రచురణల’ సంస్థను ఏర్పాటు చేసాను. నా రెండవ కవితా సంపుటి ‘తడి ఆరని దు:ఖం’. 2018లో ఓ పత్రిక కోసం రాసిన సామాజిక అంశాలతో ‘కచ్చీరు ముచ్చట్లు’,’అలల అంతరంగం’ కవితా సంపుటిని ప్రచురించాను. 2020లో నా మొదటి కథల సంపుటి ‘గణిక’ తీసుకుని వచ్చాను. కొందరు ఆత్మీయ మిత్రులతో చేసిన చర్చల ఫలితంగా మహిళా రచయితలతో ఏదైనా ఒక అంశం మీద కథలు రాయించాలన్న ఆలోచన కలిగింది. ఫలితంగా 2023లో ‘స్వయంసిద్ధ’ (ఒంటరి మహిళల జీవన గాధలు) 40 మంది రచయితలతో కథలు రాయించి సంకలనంగా తెచ్చాము. అచ్చువేసిన నాలుగు నెలల్లోనే 500 కాపీలు పోవడంతో రెండవ ముద్రణ వేసాము. 2024 జనవరిలో నా రెండవ కథల సంపుటి ‘విభజిత’ ప్రచురించాను. అప్పటి నుంచి కొత్త, పాత మహిళా రచయితల మేళవింపులతో ప్రతి ఏడాది ఓ కథా సంకలనం తేవాలనుకున్నా. ఆ దృష్టితోనే ‘మాతృత్వం-భిన్న వ్యక్తీకరణలు’ అనే అంశం మీద కథలు రాయమని కోరాను. వచ్చిన మొత్తం 70 కథలలో 53 కథలు ‘యోధ’కు ఎంపిక చేశాము. హస్మిత ప్రచురణల ద్వారా ఇది మా రెండవ కథా సంకలనం.
కథలన్నీ మహిళలతోనే తీసుకురావ డానికి ప్రత్యేక కారణం ఏమైనావుందా..?
తప్పకుండా వుంది. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో కొన్ని ప్రచురణా సంస్థలు, కొందరి రచనలు మాత్రమే ఎంచుకుని ప్రచురించడం చూశాను. ప్రత్యేకంగా మహిళా రచయితల రచనలు ప్రచురించడానికి (అచ్చులో) ఒకటి అర తప్ప పెద్దగా కనబడవు. ఇది ఆర్థిక వ్యవహారాలతో సంబంధించిన విషయం. అందుకే కేవలం రచయిత్రుల కథలతో సంకలనాలు తేవాలనే ఉద్దేశ్యంతో కొత్తగా కథలు రాస్తున్న మహిళలతో మా ప్రచురణ సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అందులో భాగంగానే స్వయంసిద్ధ, యోధ తేవడం జరిగింది.
ఈ ఆధునిక సమాజంలో తల్లుల పట్ల సమాజ ఆలోచనా ధోరణి ఎలా వుందంటారు?
తరతరాలుగా స్త్రీలు రెండవ స్థాయి పౌరులుగానే ఉన్నారు. అదే మనువాద దృక్పథం, పితృస్వామిక భావజాలం. వాటిని వ్యతిరేకిస్తూ మహిళలు ఎన్నో పోరాటాలు చేసి చట్టాలను తెచ్చుకున్నారు. అన్ని రంగాలలో ఎంత ఉన్నత స్థాయిలో ఎదిగినా కుటుంబ వ్యవస్థలో వారి స్థానం రోజురోజుకు కుంచించుకునే పోతోంది. ముఖ్యంగా నిర్ణయాధికారంలో అధికారం, హక్కులు లేవు. కడుపున పుట్టిన పిల్లలు సైతం తల్లులను తెలివి హీనులుగా చిత్రీకరిస్తూ కించ పరుస్తుంటారు. ఆ సమయాల్లో తల్లుల వేదన వర్ణానాతీతం. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు తండ్రి బాధ్యత కూడా. ఆ మార్పు దిశగా సమాజానికి అర్ధం చేయించాలన్న ప్రయత్నమే మా ‘యోధ’ ముఖ్య ఉద్దేశం.
ఓ రచయిత్రిగా, తల్లిగా మీ అనుభవాలుఏంటి?
ఒక తల్లిగా అందులో ఆడపిల్ల తల్లిగా కుటుంబంలో, సమాజంలో నేను కూడా ఆ వివక్షను ఎదుర్కొన్నాను. పిల్లలు పుట్టని స్త్రీలను, అందులో మగ పిల్లల్ని కనలేదని, పిల్లలు పుట్టడంలో జరిగిన జాప్యం వరకు. వివక్ష, అణచివేతలతో పాటు అవమానాలకు నేను కూడా అతీతం కాదు. ఈ బాధలను భరిస్తూనే ఎందరో స్త్రీలు తమ జీవితాలను ఒంటరిగానే వెళ్లదీస్తున్నారు. ధైర్యం గలవారు తమను తాము ప్రేమించుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఓ రచయితగానూ పురుషుల నుండి అవమానాలు ఎదుర్కొన్నాను. అలాంటి వారికి స్త్రీలు ఎంత నిబద్దతగా వుంటారో చెప్పడమే నా కథలకు ప్రేరణ. ఆ ప్రేరణనే నా ప్రచురణ సంస్థకు ఆలంబన.
సమాజం పట్ల రచయిత్రుల బాధ్యత ఎలా వుండాలంటారు?
ఏ రచయిత అయినా సమాజానికి జవాబుదారీగా వుండాలి. సమాజంలో కనిపిస్తున్న లోపాలను, సమస్యలను ఎత్తి చూపడంలోనే కాదు వాటి పరిష్కారం, మార్పు దిశగా పాఠకులు ఆలోచించేలా రచనలు ఉండాలి. ఓ ఎరుకతో కూడిన బాధ్యత రచయితకు ఉన్నప్పుడు సమాజంలో స్త్రీల పట్ల దృక్పథం మారే అవకాశం వుంటుంది. అలాంటి రచయితలకు లింగ బేధం లేకుండా సమాజంలో సముచిత స్థానం వుంటుందని నమ్ముతాను.

స్త్రీ జీవితమే నా కథ వస్తువులు
10:49 pm