ఉత్సాహపూరితమైన బుధవారం ఆఫర్‌ను పరిచయం చేసిన వండర్‌లా

నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్, అడ్వెంచర్ కోరుకునే వారందరికీ సంతోషం  మరియు సాహసోపేత అనుభవాలను అందించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సందర్శకులు తమ పార్క్ ప్రవేశ టిక్కెట్లపై 25% ఆదా చేసుకునే అద్భుతమైన డీల్స్ తో  బుధవారాలు ఇక  మరింత సరదాగా మారతాయి. ఈ ఆఫర్ ప్రతి బుధవారం ఒక్కో పార్క్‌కు మొదటి 1000  ఆన్‌లైన్‌  టిక్కెట్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి మీ టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోండి.ఈ పరిమిత కాల  కార్యక్రమంలో భాగంగా, ఆన్‌లైన్ టిక్కెట్ కొనుగోళ్ల  పై ఫ్లాట్ 25% తగ్గింపు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది, సందర్శకులు తమ  సందర్శనను ప్లాన్ చేసుకోవడానికి మరియు తమ సౌలభ్యం ప్రకారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. వండర్ లా – బెంగళూరు, హైదరాబాద్ మరియు కొచ్చిలోని మూడు పార్కులలో ఆన్‌లైన్ టిక్కెట్‌లకు మాత్రమే ఈ  ప్రత్యేకమైన ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. దీని గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి  మాట్లాడుతూ, “ఈ అద్భుతమైన తగ్గింపుతో బుధవారాలు  మరింత ఆనందాన్ని తీసుకువస్తాయి, మరియు ఈ ఆఫర్ తో  ప్రతి ఒక్కరూ ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని సులభంగా అనుభవించగలుగుతారు. ఈ అద్భుతమైన ఆఫర్, మమ్మల్ని అభిమానిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపే మార్గం మరియు వారికి సాటిలేని ధరతో  వండర్ లా లో అద్భుత అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాము ” అని అన్నారు   సందర్శకులను తమ  ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా ముందుగా తమ  ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని వండర్ లా  ప్రోత్సహిస్తుంది. మరింత సమాచారం కోసం https://www.wonderla.com/offers/save-25-on-wednesdays-at-wonderla-parks.html ని సందర్శించండి  లేదా కాల్ చేయండి: గళూరు: +91 80372 30333, +91 80350 73966, హైదరాబాద్: 0841 4676333, +91 91000 63636, కొచ్చి: 0484-3514001, 7593853107.