
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెసిఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్ పేర్కొన్నారు. మండలంలోని కొండాపూర్ గుండారం, ఎల్లారెడ్డిపల్లి, సిద్ధాపూర్, ఎల్లారెడ్డి పల్లి తండా, ఆర్గొండ బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన సోమవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రతి వ్యక్తిని పలకరిస్తూ తనకు ఓటు వేసి ఎల్లారెడ్డి అభివృద్ధి కి కృషి చేయాలని ఆయన సూచించారు. కెసిఆర్ ప్రభుత్వం రైతులకు రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు కార్యక్రమాలు లాంటి ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూప, జడ్పిటిసి కొండా హనుమాన్లు, కృష్ణమూర్తి వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.