నవతెలంగాణ పెద్దవంగర: ఎరుకల కులస్తుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. జిల్లా స్థాయి ఎరుకల మహిళ రణభేరి సదస్సుకు తరలి వెళ్లే వాహనాలకు శనివారం ఆయన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ఎరుకల కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, మండల నాయకులు దుంపల సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, మాజీ సర్పంచ్ మనుపాటి రేణుక, మండల ఎరుకుల సంఘం అధ్యక్షుడు జంపయ్య, ఎరుకల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూతటి రమేష్, ఎరుకుల మహిళా అధ్యక్షురాలు అనూష, వార్డు సభ్యులు ఏదునూరి డీలర్ సమ్మయ్య, నాయకులు మహంకాళి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.