మైనార్టీ సంక్షేమానికి కృషి

– తాండూరులో అభివృద్ధి
– పనులకు రూ.తకోటి నిధులు ఇప్పిస్తాం: మంత్రి మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
మైనార్టీల సంక్షేమం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులశా ఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రం జిత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని మంత్రి మహేందర్‌ రెడ్డి నివాసంలో తాండూర్‌ ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు అబ్దుల్‌ హాది, మహమ్మద్‌ కుకుర్షీద్ద్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ హమీ ద్‌, షౌకత్‌ పటేల్‌, నాయక్‌ అలీ, ఎంఎస్‌ సత్తార్‌ గోల్కొండ, నసీముద్దీన్‌, నయీమ్‌ అప్పు, మహమ్మద్‌ ఫయాజ్‌ అలీ తదితరులు మంత్రితో పాటు ఎంపీ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న పరిమళ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీ ఆర్‌ మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవే శపెడుతున్నారని చెప్పారు. తాండూర్‌ పరిసరాల్లోని రాజీ వ్‌ కాలనీ హైదరాబాద్‌ రోడ్డులో గతంలో తమకు మం త్రిగా మహేందర్‌ రెడ్డి కేటాయించిన స్థలం పరిసరాల్లోనే సర్వే నెంబర్‌ 52లో స్మశాన వాటికకు 5 ఎకరాలు, ఈద్గా కు మరో 5 ఎకరాలు కేటాయించాలని వినతి పత్రం అం దించారు. పాత ఈద్గా మైదానం ఉన్న సర్వేనెంబర్‌ 109 లో మరో 25 గుంటల భూమికి ప్రోసిడింగ్‌లు ప్రభు త్వప రంగా ఇప్పించాలని మైనార్టీ బాలికల పాఠశాల పరిసరాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజు కాలనీ, ఇందిరా కాలనీ ప్రాంతాల్లో ఉన్న మసీదుల స్థలాల కు ప్రభుత్వపరంగా పట్టా సర్టిఫికెట్లు ఇప్పించాలని, డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జనాభా రేషియో ప్రకారం తమకు 40 శాతం ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకో వాలని వారు విన్నవించారు. పెండింగ్‌లో ఉన్న తాండూ రు ఇందిరా చౌక్‌ నుండి రైల్వే స్టేషన్‌ వరకు రోడ్డు వెడల్పు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. మంత్రి మాట్లాడుతూ.. తాండూరులో ముస్లిం మైనారిటీల కోసం చేపట్టి మిగిలిపోయిన పలు అభివృద్ధి పనులకు కో టి నిధులను అందిస్తామని వెల్లడించారు. నియోజకవ ర్గంలోని ముస్లిం మైనార్టీలకు అందుతున్న పథకాలను సరై న సమయంలో అందేలా చూడాలని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులను కోరారు. కొన్ని ఏళ్లుగా తాండూర్‌లో అన్ని మతాల సామరస్యత ఉన్న నేపథ్యంలో దానిని అలాగే కా పాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుద్దామన్నారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డిలతో కలిసి వారి నిధులను ఉపయోగిస్తామన్నారు. ఎంపీ రం జిత్‌ రెడ్డి మాట్లాడుతూ తాండూర్‌లో మైనారిటీల కోసం తాను ప్రకటించిన రూ. 50 లక్షల నిధులను అందేలా చూ స్తామన్నారు. భేటీలో మైనారిటీ నాయకులు షేక్‌ ముజీబ్‌ అబ్దుల్‌ రషీద్‌, మహమ్మద్‌ గౌస్‌ భాష, ఉర్దూ ఘర్‌ చైర్మెన్‌ అబ్దుల్‌ రజాక్‌, జిల్లా ఆర్టీఏ డైరెక్టర్‌ మహమ్మద్‌ జావిద్‌, జైనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.