– ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి: మంత్రి హరీష్ రావు
– మనోహరాబాద్ మండలం సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన నాయకులు
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్
పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్టు మంత్రి హరీష్ రావు నాయకులకు సూచించారు. మంగళవారం ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మెన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు శివగోని పెంటా గౌడ్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండలం నుంచి నాయకులు మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించినట్టు తెలిపారు. మండలంలోని నాయకులు సర్పంచులు మండలంలోని కొన్ని గ్రామాలకు బీసీ బందు రాలేనట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని సూచించినట్టు నాయకులు తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్లు శ్రీహరి గౌడ్, నవీన్, పాలాట నాయకులు పల్లపు రమేష్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.