మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలి..

Work hard to get good results.–  జిల్లా విద్యాశాఖ అధికారి రామరావు 
నవతెలంగాణ – ముధోల్ 
 పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా డిఇఓ రామరావు అన్నారు. నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను గురువారం సందర్శించారు.ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలపై చర్చించి సలహాలు, సూచనలు, ఇచ్చారు. . ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వెనుకబడుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులను ప్రత్యేక తరగతుల ద్వారా వారిని ప్రోత్సహించాలని, సూచించారు. బడికిరాని విద్యార్థుల ఇండ్లను సందర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి వచ్చే విధంగా వారందరినీ 10వ తరగతి లో ఉత్తీర్ణులు కావడానికి కృషి చేయాలనిఅన్నారు. ఈయన వెంటసెక్టోరియల్ ఆఫీసర్ రాజేశ్వర్ , లింబాద్రి ఉపాధ్యాయులు, తదితరులున్నారు.