– కలెక్టర్ బి.విజయేందిర బోయి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు టీమ్ వర్క్ తో పని చేయాలని, కార్యక్ర మాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయా లని నూతన జిల్లా కలెక్టర్ బి.విజయేందిర బోయి అన్నారు.మంగళ వారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నూతన జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహి ంచారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యక్ర మాలు, సమస్యలు ఆయా శాఖల వారీగా అధికా రులు సమావేశం లో వివరించారు.అన్ని శాఖల అధికారుల సహకారం తో జిల్లాను అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాల అమలు లో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.ప్రజా వాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులు పరిష్కరించడం లో గుణాత్మకంగా సమస్యలు పరిష్కారం చూపాలని అన్నారు. వర్షాలు పడుతున్నందున వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ రాజ్,గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయంతో అన్ని చర్యలు తీసు కోవాలన్నారు. పారిశుధ్యం, వ్యాధుల నివారణకు అన్ని ముందస్తు కార్యక్రమాలను కార్యాచరణ ప్రణాళిక ననుసరించి చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా వానా కాలం సాగు పంటల విస్తీర్ణం,పంటల సాగు, ఎరువులు, విత్తనాల సరఫరా గురించి జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి వివరించారు. విత్తనాలు, ఎరు వుల సరఫరా గురించి ప్రతి రోజు రిపోర్ట్ చేయాలని సూచించారు.విద్యా శాఖ ద్వారా పాఠ శాలలు ప్రారంభం కాగానే ఒక జత యూనిఫాం,పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరఫరా చేసినట్లు,అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో అత్యవసర రిపేర్ పనులు 5 రకాల పనులు చేపట్టి నట్లు,మొదటి ,రెండవ దశలో 642 పాఠశాలల్లో పనులు చేపట్టి నట్లు తెలిపారు.మొదటి దశలో చేపట్టిన 490 పాఠశాలల్లో పనులు పూర్తి కావచ్చినట్లు తెలిపారు.రెండవ దశలో 152 పాఠశాలల్లో పనులు పురోగతి లో నున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.ఎస్సీ.అభివృద్ది శాఖ, ఎస్టీ.,బీసీ., మైనార్టీ,ఇంటర్ మీడియర్ విద్య,వైద్య ఆరోగ్య శాఖ,పౌర సరఫరాల శాఖ,జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మున్సిపాలిటీలు, గనులు, భూ గర్భ శాఖ, వివిధ శాఖల వారీగా వివరించారు. ఎటువంటి సమస్యలు న్నా తన దృష్టికి తీసుకురావాలని ఆమె సూచిం చారు. ఆయా శాఖల వారీగా ప్రతి నెల రెగ్యులర్‌గా నిర్వహించే సమావేశాలు నిర్వహించి సమీక్ష చేయాలని అన్నారు.శాఖల వారీగా కార్యక్రమాల అమలు సమీక్ష చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.