– ఎస్పీ రాహుల్ హెగ్డే ….
నవతెలంగాణ -కోదాడరూరల్
ఎన్నికలవేళ సమన్వయంతో పని చేయలి అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.బుధవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి ఎన్నికల నిర్వహణ, పోలీస్ స్టేషన్ ల భౌగోళిక విస్తీర్ణం పరిశీలించారు. గత ఎన్నికల అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయంగా పని చేయాలి అన్నారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిపై నిఘా ఉంచాలి అని ఆదేశించారు. అనంతరం 29 వ తేదీన జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ, హెలిప్యాడ్ కు సంభందించిన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది తో పాటుగా పారామిలటరీ సిబ్బంది విధుల్లో ఉంటారు అని, వీరికి సంభందించి బస చేసే వసతి పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. వసతుల కల్పనను ఎస్పీ పరిశీలించి లోపాలు లేకుండా, బయటనుండి వచ్చే సిబ్బందికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ తనిఖీ చేశారు వాహనాల తనిఖీలు పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి తనిఖీలు పక్కాగా చేయాలి అన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రలోభాలను అడ్డుకోవాలని ఆదేశించారు. విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నార్కోటిక్ పదార్థాలు, అక్రమ మద్యం లాంటివి సీజ్ చేయాలని ఆదేశించారు. ఆంధ్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారం కావున ఎన్నికల సంఘం సైతం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది కావున అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జీఎస్టీ అధికారులు, ఐటి అధికారులు నిభందనలు పాటించాలి అన్నారు.వారి వెంట డిఎస్పి ప్రకాష్, పట్టణ సీఐ రాము, రూరల్ సీఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ ఐ లు యాదవెందర్, రామాంజనేయులు, సాయి ప్రశాంత్, రాంబాబు, సిబ్బంది ఉన్నారు.