– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నవతెలంగాణ-కౌడిపల్లి
వారం రోజులలో అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తునికి ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 562 అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కొనసాగుతున్నాయన్నారు. తునికి ఉన్నత పాఠశాలలో పనులు బాగున్నాయని కాంట్రాక్టర్ చల్ల కుమార్‌ను అభినందించారు. దీనిలో భాగంగా బడిబాట కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శులు మండల కమిటీ, విలేజ్ కమిటీలుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి పని చేస్తూ బడిబయటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కషి చేస్తారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా పనిచేస్తారన్నారు. ఈ పనులు పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు జూన్ 10 వరకు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో బెంచీలు, డ్రింకింగ్ వాటర్, పెయింటింగ్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలగా ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉండడంతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే పదవ తరగతిలో మెరిట్ సాధిస్తున్న ఘనత ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
గురువారం కౌడిపల్లి మండలం వెలమకన్నలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయగా మిగిలిన పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఐదు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. తీసుకున్న ధాన్యంకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం జరుగుతుందన్నారు. రైతులు అధైర్య పడవద్దని వర్షాలు కురవడం లేదు కాబట్టి మరో ఐదు రోజుల్లో పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు అందజేస్తున్నామన్నారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో లేబర్ కొరత ఉందా లారీలు వస్తున్నాయా తేమశాతం సరిగా ఉంటేనే తూకం వేయాలని సూచించారు. నిదానంగా సంబంధిత రైతుసేవ కేంద్రాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రోజువారీగా విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకు ఎంత అవసరమో అంతే విత్తనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కౌడిపల్లి మండలం నాగసాన్పల్లి డిసిఎంఎస్ ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ తనిఖీ కౌడిపల్లి మండలానికి 200 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాల పెద్ద జనము, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి 60 క్వింటాళ్ల జీలుగా, 30 క్వింటాళ్ల పెద్ద జనము విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌్ ఆంజనేయులు, మండల విద్యాధికారి బుచ్చ నాయక్, ఆర్‌ఐ శ్రీహరి, ఏడిఏ పుణ్యవతి, ఏవో స్వప్న జాదవ్, ఎంఐఎస్ ఆంజనేయులు, నరేష్, కాంట్రాక్టర్ చెల్లా కుమార్, లక్ష్మణ్ తదితరులున్నారు.