పనులు సకాలంలో పూర్తి చేయాలి

– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 
– అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ-తాడ్వాయి : మేడారం మహా జాతరకు భక్తుల సౌకర్యార్థం జరిగే అభివృద్ధి పనులు నాణ్యతగా, వేగవంతంగా సకాలంలో పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐ టి డి ఎ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి.శ్రీజ లతో కలిసి, వివిధ శాఖల  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో తిరిగి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మేడారం మహా జాతర సమయం ఆసన్నమైందని నెల 20 రోజులు మాత్రమే ఉన్నదని అధికారులు నాణ్యతగా, పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మేడారం మహా జాతరకు సుమారు కోటి 50 లక్షలు భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్లలో భాగంగా పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ పనుల పురోగతిపై సమీక్షించారు.  మేడారం దర్శనంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,  పార్కింగ్, త్రాగునీరు, పారిశుద్ధం,  భక్తులు అమ్మవారిని దర్శించుకునే టప్పుడు క్యూలైనలు తదితర ఏర్పాట్ల పై దిశ నిర్దేశించారు. గత జాతరలోని లోపాలను జరగకుండా ఈ సంవత్సరం మహా జాతరకు మెరుగైన సౌకర్యాలు అందించేలా కృషి చేస్తామన్నారు.అనంతరం ఆలయ ప్రాంతంలో ఎండోమెంట్స్ పనులను పరిశీలించారు. మేడారం వద్ద ఆర్డబ్ల్యూఎస్ డార్మిటరీ భవనం వెనుక పూజారులకు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాజేందర్, పంచాయితీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, డిపిఓ వెంకయ్య, ఎంపీడీసీఎల్ డిఈ పులుసం నాగేశ్వరరావు, ఏపీవో వసంతరావు, ఐటీడీఏ ఎస్ ఓ రాజ్ కుమార్, ఎండోమెంట్ డి ఈ రమేష్
తదితరులు పాల్గొన్నారు.