మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలి

Work should be done for the development of fishermen– జిల్లాసంఘం డైరెక్టర్ పెండ్యాల ఐలయ్య
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మత్స్యకారుల సమస్యల పరిష్కరించి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ పెండ్యాల ఐలయ్య అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు, మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ముదిరాజులను బీసీ డీ నుండి  బీసీ ఏ లోకి చేర్చాలని తెలిపారు. సంఘాలకు భవన నిర్మాణాలకు స్థలాలను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలన్నారు. హుస్నాబాద్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ  ప్రపంచంలోనే కల్తీ లేని ఆహారం చేపలు మాత్రమే అన్నారు. అట్టి కల్తీ లేని ఆహారాన్ని తమ ప్రణాలను పణంగా పెట్టి ప్రజలకు అందించేది ఒక మత్స్యకారులు మాత్రమే అని అన్నారు అలాంటి మత్స్యకారులకు  ప్రభుత్వాలు ఎం చేస్తలేవని అన్నారు.50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మా జనాభాకు తగ్గట్లు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అలాగే మా సంఖ్యాపరంగా.ముదిరాజ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసినందున రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు..ఈ కార్యక్రమంలో పోతారం ఎఫ్ సి ఎస్  చైర్మన్ సున్నపు రమేష్ చైర్మన్ పిట్టల బాలయ్య ,ముదిరాజ్, గీకురు సంపత్, చైర్మన్ పెసరు రాజయ్య ముదిరాజ్, బోడ శంకర్ ముదిరాజ్,హుస్నాబాద్ టౌన్ అధ్యక్షులు జనవేని శ్రీనివాస్ రాగుల శ్రీనివాస్ ముదిరాజ్, పోతారం ఎస్ కార్యదర్శి మెడబోయినఆంజనేయులు ఉప సర్పంచ్ శ్రీనివాస్ ,,మండల యూత్ నాయకులు భాషవేణి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.