రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు, నాయకులు పని చేయాలని అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర పార్టీ, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డిల ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రమైన తాడిచర్ల లో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ముడితనపెల్లి ప్రభాకర్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే నూతన కమిటీ నియామకాలు, ప్రజాసమస్యలపై దృష్టి సారించి బలమైన ప్రతి పక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రదాన కార్యదర్శి సభావట్ నాగరాజు నాయక్, అధికార ప్రతినిధి చొప్పరి రాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ నిషాన్ పాష, బిజెపి నాయకులు గాదనవేన రాజయ్య, గాదనవేన గణేష్, అక్కల రమేష్, కంబాల శ్రీకాంత్, తూండ్ల రాజయ్య, చేరాలు, బుట్టి రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.