నవతెలంగాణ – పెద్దవంగర: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు కోసం సర్వే లో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతుందని, అర్హులైన నిరుపేదలకే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు, ఓరుగంటి సతీష్, బానోత్ గోపాల్, తోటకూరి శ్రీనివాస్, పూర్ణచందర్, బానోత్ సీతారాం నాయక్, దాసరి శ్రీనివాస్, బొమ్మెరబోయిన రాజు, ఎండీ జాను, బీసు హరికృష్ణ, వేముల వెంకన్న, బండారి వెంకన్న, దంతాలపల్లి ఉపేందర్, జాటోత్ వెంకన్న, బానోత్ సోమన్న, మోహన్ రావు, యాకయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.