– మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి
నవతెలంగాణ – మంథని
పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపెల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త,నాయకులు, పనిచేయాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు.రమ-సురేష్ రెడ్డి కోరారు. సోమవారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి,కుచిరాజ్ పల్లి ప్రాంతాల్లో మంథని మున్సిపల్ చైర్మన్ రమా-సురేష్ రెడ్డి స్థానిక నాయకులు వార్డు కౌన్సిలర్లతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాలనీలోని అన్ని వీధులను తిరుగుతూ,ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను సైతం కలిసి చైర్మన్ పరామర్శించారు. తమ ప్రాంతానికి ప్రచారం కి వచ్చిన మున్సిపల్ చైర్మన్ దంపతులను కాలనీ వాసులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు. పెద్దపల్లి ప్రాంతానికి దుద్దిల్ల కుటుంబం,కాక కుటుంబం ఎనలేని సేవలు అందించారని అటువంటి కుటుంబాల నుంచి వచ్చినా మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న కాక కుటుంబంలోని ఒకరైన వెంకట స్వామి మనవడిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య,కౌన్సిలర్లు వీకే రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీమ్ ఖాన్,పాపారావు,బండారి ప్రసాద్,కనుకుంట్ల బాపులతోపాటు తదితరులు పాల్గొన్నారు.