పని ఒత్తిడి, మానసికంగా క్రుంగి పోయి, జీవితం పై విరక్తి చెంది..

– పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ ఎఈఈ మృతి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
పని ఒత్తిడి వాళ్ళ మానసికంగా క్రుంగి పోయి, జీవితం పైన విరక్తి చెంది పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న కత్తులపురం సాయి చరణ్ 25 గత 6 నెలల క్రితం నీటి పారుదల శాఖలో ఎఈఈ గా ఉద్యోగం పోందరు. ప్రస్తుతం ధర్పల్లి మండలలో వీధులు నిర్వహిస్తున్నడు.ఉద్యోగం లో పని ఒత్తిడి చాలా ఉన్నదాని అతని తల్లిదండ్రులకు చెప్పి మానసికంగా బాధ పడుతుండే వాడని సాయి చరణ్ (28) మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లి వస్తానని ఇంట్లో చేప్పి వేళ్ళడని అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గుర్తు తెలియని పురుగుల మందును నడిపల్లి గ్రామ శివరులో త్రాగి, చికత్స పొందుతు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ తెలిపారు. మృతినికి ఇంకా వివాహం కాలేదని, మృతుడు పని ఒత్తిడి వాళ్ళ మానసికంగా క్రుంగి పోయి, జీవితం పైన విరక్తి చెంది పురుగుల మందు త్రాగి ఆత్మ హత్య చేసుకున్నాడని, మృతిని అక్క తంగాళ్లపల్లి హారిక పిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయన వివరించారు.