నవతెలంగాణ – దుబ్బాక
“వార్డు అభివృద్ధికి కోసం అహర్నిశలు అంకితభావంతో పనిచేశాను.మున్సిపల్ లోనే ఒకటో వార్డ్ ను అన్ని విధాల అభివృద్ధి చేశాము.ఇందుకు మున్సిపల్ అధికారులు,సిబ్బంది చేసిన కృషిని మరువబోను.తనకు ఇంతటి గుర్తింపు మీ వల్లే.” అని ఒకటో వార్డ్ కౌన్సిలర్ నిమ్మ రజిత అన్నారు.ఈ ఐదేళ్లుగా తమ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మున్సిపల్ సిబ్బంది సేవలను కొనియాడారు.వారి సేవలను గుర్తిస్తూ శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని కౌన్సిలర్ నిమ్మ రజిత స్వగృహంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ ఎన్.వై.గిరి హాజరై.. మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్,మున్సిపల్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించి మెమెంటోలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ బీ.ప్రవీణ్ కుమార్,ఇంచార్జ్ శానిటరీ ఇన్ స్పెక్టర్ యం.దిలీప్ కుమార్,మున్సిపల్ సిబ్బంది పలువురున్నారు.