తాడిచెర్ల ఓసిపిలో కార్మికుల సేఫ్టీ విధానం భేష్..

– సింగరేణి కాలరీస్ సేఫ్టీ అధికారి…ఎస్ వి రావు.
నవ తెలంగాణ- మల్హర్ రావు:
ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1లో  బొగ్గు తవ్వకాలు, కార్మికుల కోసం చేపట్టిన సేఫ్టీ విధానం భేష్ ని సింగరేణి కాలరీస్ సేఫ్టీ అధికారి ఎస్ వి రావు అన్నారు. 54వ వార్షిక రక్షణ పక్షోక్షవాలను పురస్కరించుకొని సింగరేణి కాలరీస్ బృందం ఎన్.వి.రావు జి.ఎం., ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓసిపిని గురువారం తనిఖీ నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం స్పెషల్ సేఫ్టీ కమిటీ వారితో సమావేశమై ఆక్సిడెంట్ స్థితిగతులు తెలుసుకొని, సేఫ్టీ అవేర్నెస్ పైన సభ్యులకు  అవగాహన కల్పించారు. అలాగే టీం సభ్యులందరూ మైన్ ను తనిఖీ చేసి వర్కింగ్ ప్లేస్ లో ఉన్న సిబ్బందిని సేఫ్టీ పైన పరీక్షించారు. సిబ్బంది సమాధానాలను విని తనిఖీ బృందం సంతృప్తి చెంది వారికి స్పాట్ ప్రైసేస్ ప్రజెంటేషన్ అందజేశారు. తనిఖీలు భాగంగా సాయంత్రము 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ప్రాక్టీస్ పైన వచ్చిన బహుమతిని కన్వీనర్ చేతుల మీదుగా ఏజెంట్ పి బాలరాజు, జీఎం పి మోహన్ రావు, మైన్ మేనేజర్ కెఎస్ఎన్.మూర్తి, సేఫ్టీ ఆఫీసర్ కె.సురేష్ బాబు లకు ఈ అవార్డును అందజేశారు.అనంతరం సేఫ్టీ పైన ఒక చిన్న నాటికను ప్రదర్శింవచ్చారు.ఈ నాటిక ఆహుతులను చాలా చక్కగా ఆకట్టుకుందన్నారు. తదుపరి క్విజ్ కాంటెస్ట్లో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా టీం కన్వీనర్ శ్రీ ఎన్.వి. రావు  మాట్లాడుతూ గనులలోని పని స్థలాలు గాని, యంత్రములు పని విధానం భేష్ అన్నారు. ఈ మైన్ యొక్కసేఫ్టీ స్టాండర్డ్స్ ఇలాగే చక్కగా కొనసాగించవలనని సూచించారు. ఈ మీటింగ్ అనంతరం గని యొక్క లైటింగ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో మైన్ హెడ్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, పిఆర్ఓ మల్లేష్ పాల్గొన్నారు.