సామాజిక అభివృద్ధిలో కీలక పాత్రధారులు కార్మికులే..

– సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
– సీఐటియు నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
హమాలీ కార్మికులు మేలు కోరుతూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,యాబై ఏళ్ళు నిండిన హమాలీ కార్మికులకు ఫించన్ సౌకర్యం కల్పించాలి అని సీఐటియు  జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.సోమవారం హమాలీ అడ్డా వద్ద నాగేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ పాలకులు ఎవరు ఉన్నా హమాలీ కార్మికులు సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని వాపోయారు.ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలు ఏవి వీరికి వర్తించవని,సామాజిక ఉత్పత్తి లో కీలక భాగస్వామ్యం వహిస్తున్న ఈ కార్మికుల పట్ల ఏ పాలకులకు చిత్తశుద్ది లేదు అని అన్నారు.పెరుగుతున్న ధరలు తగ్గించాలని,కార్మిక చట్టాలను అమలు చేయాలని,లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16 న జరిగే దేశవ్యాప్త సమ్మె లో హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు ఏసు, రాంబాబు, రమేష్, హనుమంతరావు,మారేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.