– జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపాలిటీ శానీటేషన్ సిబ్బంది ఆరోగ్యం కొరకై వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును ప్రారంభించిన జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ప్రియాంక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో సూర్యాపేట ప్రజలు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని అన్నారు. శానిటేషన్ కార్మికుల ఆరోగ్యాన్ని పరీక్షించుటకు వచ్చినటువంటి వెన్నెల హాస్పిటల్ డాక్టర్లకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కరోనా టైం లో ప్రాణాలకు సైతం పణంగా పెట్టి ప్రజల ఆరోగ్య కాపాడుటకు మీరు చేసిన కృషి వల్ల సూర్యాపేట మున్సిపాలిటీ కార్మికులకు జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. కావున ఈ ఫ్రీ హెల్త్ క్యాంపును ప్రతి కార్మికులు సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాలకు కావలసిన మందులను తీసుకోగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ తాహెర్ పాషా,డి ఈ సత్య రావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్ ఎస్ ప్రసాద్,వెన్నెల హాస్పిటల్ డాక్టర్ నరేష్, హాస్పటల్ సిబ్బంది, మున్సిపాలిటీ జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.