
ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండ గంగాధర్ కోరారు. బుదవారం మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో గల ఐఎంఎల్ డిపో వద్ద మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్ మాట్లాడుతూ.. మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారులు, పాలకవర్గాల దోపిడీ అణిచివేత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకుంటూ, వర్గ ఐక్యతను కాపాడుతున్న శ్రామిక ప్రజలకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. 1886 మే 1 అమెరికా చికాగో నగరంలోని హే మార్కెట్లో ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాదిమంది కార్మికులు ప్రదర్శన పై ఆనాటి పాలకవర్గం ఆదేశాలతో పోలీసులు దౌర్జన్యాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారన్నారు. ఆ దాస్టికాన్ని మేడే పోరాట వీరులు వీరోచితంగా ప్రతిఘటించారనీ, శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కార్మిక హక్కుల రక్షణకై మేడే పోరాటంలో తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించారనీ, ఆగస్టు స్పెయిన్ అల్బర్ట్ పర్సన్స్ అడల్ట్ ఫిషర్ జార్జ్ ఎంగిల్స్ లను ఆనాటి పాలకవర్గం ఉరితీసిందనీ, మేడే చరిత్ర మొత్తం రక్తతర్పణంతో లభించిందనీ, విరే అంతర్జాతీయ కార్మిక ఐక్యతకు సంకేతం శ్రామిక వర్గ విజయానికి చిన్న ఈ ఘటన వాళ్ళని ఎనిమిది గంటల పని దినం చట్టబద్ధం చేయబడిందనీ, అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి 1890 మే 1న అమెరికా కార్మిక సంస్థ ప్రతిఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చిందనీ తెలిపారు. 138 ఏళ్ల క్రితం కార్మికులు సాధించిన పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయినీ, ఇవాల్టి కార్మికుల దుస్థితి పాలకవర్గాలగా నియంతృత్వ పోకడలను గమనిస్తే మళ్లీ మేడే ఆవిర్భావం నాటి కిరణ్ కుష ధోరణలు పునరావృతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఇ. సాయిలు, ఐ ఎం ఎల్ డిపో కార్మికుల అధ్యక్షులు దుబ్బాయి శ్రీను,కార్యదర్శి లక్ష్మి నారాయణ, కార్మికులు పాల్గొన్నారు.