నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో జరిగిన సీఐటీయూ అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సబ్ డివిజన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి చేయూత నందించాలన్నారు.విద్యుత్ శాఖ పరిధిలో అనునిత్యం విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీసవేతనాలు అందించి రెగ్యులరైజ్ చేయాలన్నారు.అనంతరం పలువురు కార్మికులు సీఐ టీయూలో చేరారు.వారికి సభ్యత్వం అందజేసి యూనియన్‌లోకి ఆహ్వానించారు.ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోటగిరి వెంకట నారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్, యూనియన్ జిల్లా అధ్యక్షులు సీిహెచ్ నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు, కే.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.