ఒంటి కాలుపై నిలబడి కార్మికుల నిరసన

– జీవో 60ను అమలు చేయాలని డిమాండ్‌
– నాగర్‌ కర్నూల్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఘటన
నవతెలంగాణ- కందనూలు
కనీస వేతనాలు అమలు చేయా లని, జీవో నెం.60 అమలు చేయా లని కోరుతూ నాగర్‌ కర్నూలు జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతి లో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది ఆందోళన చేశారు. గురువారం జనరల్‌ ఆస్పత్రి వద్ద వంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ.. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నా వేతనాల పెంపు విషయంలో ప్రభు త్వం స్పందించడం లేదన్నారు. కనీస వేతనాల జీవో 60ను అమలు చేయా లని, అదనపు సిబ్బందిని నియమిం చాలని కోరారు. సిబ్బందిని కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆగస్టు లో జీవో అమలు చేసి వేతనాలు పెంచాలంటే.. ఇద్దరు కాంట్రాక్టర్ల గొడవతో కార్మికులు పది మాసాల వేతనం రూ.16,500 కోల్పోయారని తెలిపారు. కేవలం 32 మంది సిబ్బంది 330 పడకల ఆస్పత్రిని ఏ విధం గా శుభ్రం చేస్తారని ప్రశ్నించారు. టెండర్‌ ప్రక్రియ తొందరగా ముగిసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కొచ్చి కార్మికులకు రావాల్సిన 16,500 వేతనం వెంటనే ఇవ్వా లని, అదనపు సిబ్బందిని పెంచాలని డిమాండ్‌ చేశా రు. కార్మికులు బాల కృష్ణమ్మ, రాధ, శాంతమ్మ, బాలమణి, అలివేల, నిరంజన్‌, గిరి, వెంకటేష్‌, శేఖర్‌ బాలకృష్ణ, వెంకట్‌ పాల్గొన్నారు.