కార్మిక కుటుంబానికి కార్మికులు ఆర్థిక సాయం

నవతెలంగాణ –  వీర్నపల్లి
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం భవన నిర్మాణ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన కుటుంబ సభ్యులకు శనివారం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మల్లారపు దేవయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు న్యాత మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీ బియ్యం రూ.2000  ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ భవన నిర్మాణ జిల్లా ఉపాద్యక్షులు గుంటుకు నరేందర్, మండల ఉపాధ్యక్షులు ఈసంపల్లి రాజ్జెల్లయ్య, కోశాధికారి నార్మెట శంకర్, గ్రామ ఉపాధ్యక్షులు గౌరి రాజు, ప్రధాన కార్యదర్శి గజ్జెల సుమన్, కార్మిక సభ్యులు ఆనందం, కనుకయ్య,  పాల్గొన్నారు.