ఆర్టిజన్లను, కన్వర్షన్లను పర్మినెంట్‌ చేయాలి

Minimum wages for workers 12000 should be given
– కార్మికులకు కనీస వేతనం రూ.12000 ఇవ్వాలి
– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌

– ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహాధర్నా
నవతెలంగాణ- ముషీరాబాద్‌
విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, కన్వర్షన్లను పర్మినెంట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 11 ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.12000 ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ట్రాన్స్‌కో జెన్‌కో శాశ్వత ఉద్యోగులకు ఈపీఎఫ్‌, జీపీఎస్‌ సమస్య చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ ట్రాన్స్‌కో -జెన్‌కో ఎన్‌పీడీపీఎల్‌ హైదరాబాద్‌, వరంగల్‌ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్స్‌, కన్వర్షన్స్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ బేస్‌గా ఉన్న ఎంపీడీపీఎల్‌ కంపెనీలో 1,536, ఎస్పీడీసీఎల్‌లో గల 53 మంది అన్‌మెన్స్‌ కార్మి కులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలన్నారు. పీస్‌రేట్‌ కార్మికులైన బిల్‌ కలెక్టర్లు, స్పాట్‌ బిల్డర్స్‌, ఎస్పీఎం, పీఏఏలుగా పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్‌ 11 ప్రకారం కనీస వేతనం రూ.12000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖ శాశ్వత ఉద్యోగులకు ఈపీఎఫ్‌ టు జీపీఎఫ్‌ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. విద్యుత్‌ సంస్థల్లో ప్రమోషన్స్‌ ఇవ్వడం లేదని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 2011లో రిక్రూట్‌మెంట్‌ చేసిన జేఎల్‌ఎంలకు రావాల్సిన వేల రూపాయల ఏరియన్స్‌ ఇవ్వ కుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని, వెంటనే ఇవ్వాలని కోరారు. విద్యు త్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఉద్యో గుల సంఖ్య తక్కు వగా ఉండటంతో మెరుగైన సేవలు అందడం లేదన్నారు. మరో 18 నుంచి 20 వేల మంది ఉద్యోగులను రిక్రూట్‌ చేయాల్సి ఉందని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మహా ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్య క్షులు ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ వెంకటరాజు, ప్రసాద్‌ రాజు, ఆర్గనై జింగ్‌ సెక్రటరీలు సుధాకర్‌, రవీంద్ర ప్రసాద్‌, శశికళ బసవ రాజు, ఎస్పీడీసీఎల్‌ అధ్యక్ష కార్యదర్శులు చంద్రా రడ్డి, సత్యం, ఎన్పీడీసీఎల్‌ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్‌ పాల్గొన్నారు.