కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి

నవతెలంగాణ- గాంధారి
కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి. CITU జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ పిలుపు ఈరోజు గాంధారి మండలం లో జరిగిన CITU మండల మహాసభ జరిగింది ఈ సమావేశానికి CITU జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, రవీందర్, మోతిరాం లు హాజరై మాట్లాడుతూ కార్మికులు పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించుకున్నారు అలాంటి చట్టాలను కేంద్ర BJP ప్రభుత్వం నిర్వీర్యం చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు కార్మిక హక్కుల సాధనకై సాధించుకున్న చట్టాలను రక్షణకై కార్మిక వర్గం పోరాటా లకు సిద్ధం కావాలని ఈ పోరాటాలకు CITU అండదండలు ఉంటాయని పిలుపు నిచ్చారు..ఈ కార్యక్రమంలో మండల అన్నిరంగాలCITU నాయకులు మణెమ్మ, ప్రకాష్, శ్రీ లత రోజా, సవిత, లక్ష్మి నారాయణ, రాజు, సాయిలు, రాములు తదితరులు పాల్గొన్నారు.