– సిఐటియు నాయకులు మందా నర్సిహా రావు
నవతెలంగాణ-రామగిరి
సింగరేణి ఆర్జీ-3 ఏరియా లోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఎస్సిఈయు (సిఐటియు అనుబంధ) సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నార్సిహా రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారుల వేతనాల కంటే కార్మికులకు 11వ,వేతన ఒప్పందం ద్వారా పెరుగుదల అధికంగా ఉందనీ అక్కసుతో గని అధికారుల సంఘం కోర్టుకు వెళ్ళడం జరిగిందనీ అన్నారు. అలాగే ఆ కేసును ఉప సంహరించుకోవాలని లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వంతో పోరాడి పెంచుకోవాలని, మొదటి నుండి డిపిఈ గైడ్ లైన్స్ గురించి సిఐటియు జాగ్రత్తగా హెచ్చరిస్తూ వచ్చినా బిఎంఎస్ నిర్లక్ష్యంతో అలసత్వం వహిస్తూ రావడం, మేము మా మంత్రులతో మాట్లాడి పరిస్కరిస్తామని కాలయాపన చేస్తూ వచ్చారని ఆరోపించారు అలాగే కార్మికుల సొంతింటి కళ నెరవేరే వరకు సిఐటియు వదిలే సమస్యే లేదని అన్నారు.సింగరేణిలో విద్య,వైద్యం,సరియైన త్రాగునీరు కనీస మౌళిక సదుపాయాలు కల్పించేందుకు యాజమాన్యం వెనకాడటం సిగ్గుచేటు అని అలాగే మైన్ రాహాదారులు చాలా దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు.పని ప్రదేశాలలో షేఫ్టీ నిర్లక్షం జరుగుతుందని, ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తర్వాతా పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనీ అన్నారు. అలాగే ఏఎల్ పి బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే మొదలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-3 కార్యదర్శి దొమ్మటి కొమురయ్యనాయకులు ఈ కుమార్,ఎండి అహ్మద్ పాషా,కె వేణుగోపాల్,ఎం ప్రభాకర్, సతోష్, డి రవికుమార్, ఎం సదానందం, హబీబ్ పాషా,రాకేష్, రాజ్ కుమార్, రంజిత్, తిరుపతి తదితులు పాల్గొన్నారు.