ఉపాధి హామీ సదస్సుకు తరలి వెళ్లిన కార్మికులు

నవతెలంగాణ – చేర్యాల
ఉపాధి హామీ పథకం పై బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గురువారం ఏర్పాటు చేసిన సదస్సు లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వ్యవసాయ కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని, రోజు కూలి రూ. 600 పెంచాలని, ప్రతి కుటుంబానికి రెండు వందల పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరలి వెళ్లిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గొర్రె శ్రీనివాస్, బోయిని మల్లేశం,కనకవ్వ, బాలమణి, బాలరాజు తదితరులు ఉన్నారు.