మహిళా మత్స్యకారుల సంక్షేమానికి కృషి..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మహిళా మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. మహిళా మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ..మహిళా మత్స్యకారుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా శక్తితోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా మత్స్యకారుల కోసం పలు విధాల ప్రణాళికలు రూపొందించి తమ ప్రభుత్వం వారి వికాసానికి ముందుంటామన్నారు. సి ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని పేర్కొన్నారు