ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వం డిగ్రీ కళాశాల ను మంగళవారం రోజు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.విధ్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బాసర,తానూర్, లోకేశ్వర్ మండల విద్యార్థులకు సౌకర్య వంతము గా ఉంటుందన్నారు. డిగ్రీ కళాశాలను విద్యార్థు లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని బైంసా, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరహాలో ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కళాశాల మంజూరు కావాలని ముధోల్ మండల వాసులు ,ముధోల్ గ్రామస్తులు వీడిసి సభ్యులు తదితరులు అందరూ కృషి చేశారన్నారు. వారి చిరకాల కోరిక ఇప్పుడు నేరవేరటం సంతోషంకరమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ కళాశాల కృషి చేసిన ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు , వీడిసి సభ్యులకు, మాజీ సర్పంచ్ వెంకటపూరు రాజేందర్ కు ,గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య, నిర్మల్ ప్రిన్సిపాల్ సుధాకర్, ముధోల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ ,విడిసీ అధ్యక్షుడు నారాయణ, కోశాధికారి సాయినాథ్,మండల బిజెపి అధ్యక్షుడు కోరిపోతన్న, నాయకులు రోళ్ల రమేష్ , సాంవ్లీరమెష్.తాటివార్ రమెష్, ,దశరథ్ ,సుదర్శన్, శ్రీనివాస్,పోతన్న, సాయిరాం ,గ్రామస్తులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.