– ఐటీడీఏ ఏర్పాటు చేయాలి .
– నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో కలపాలి.
– డిటిడిఓ ఆఫీసును వెంటనే ఏర్పాటు చేయాలి.
– ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలి.
నవతెలంగాణ- మల్హర్ రావు/కాటారం.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నృత్యాలతో ప్రదర్శ చేపట్టారు. కాటారం అంబేద్కర్ సెంటర్లో ఆదివాసి జెండాను పొలం రాజేందర్ ఎగర వేశారు.అనంతరం అయ్యప్ప టెంపుల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు బద్ది సమ్మయ్య,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, తుడుందేబ్బ ప్రెసిడెంట్ కుమార్, ఆదివాసి సంఘాల జాక్ నాయకులు మాట్లాడారు ప్రపంచాది వాసి దినోత్సవం ఆదివాసులను సామాజికంగా ఆర్థికంగా విద్య ఉద్యోగ పరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి చేయాలని, ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆదివాసులకే సర్వహక్కులు సహజ వనరుల మీద ఉండే విధంగా ప్రపంచంలోని అన్ని దేశాలు విధిగా ఆచరించాలన్నారు. 1994 నుండి 2014 వరకు రెండు దశాబ్దాల కాలాన్ని అభివృద్ధి చేయాలని సూచించడం జరిగింది కానీ 2024 నాటికి కూడా ఆదివాసుల మీద అత్యంత అమానుషమైన దాడులు దౌర్జన్యాలు వారి మొనగాడనే ప్రశ్నార్థకం చేసే పాలక ప్రభుత్వాలు ఆదివాసి వ్యతిరేక విధానాలు ఫలితంగా మూడు దశాబ్దాలు గడిచిన ఇంకా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని వారు అన్నారు, ఆదివాసులు ప్రపంచంలో గాని భారతదేశంలో గానీ ఈ ఆధునిక సమాజం అనుభవిస్తున్నటువంటి ఆహార ధాన్యాలు అందించారని, అదేవిధంగా భాషలు కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నటువంటి ఇంగ్లీష్ భాష కూడా ఆదివాసి సంస్కృతిని ఇచ్చే మౌఖికంగా ఏర్పడ్డదే అని వారు గుర్తు చేశారు. ఆధునిక సమాజానికి ఎంతో మేలు చేసిన ఆదివాసి తెగలను అన్యాయంగా అణచివేసి అభివృద్ధి పేరుతోటి నిరంకుశంగా వ్యవహరించడం ఈ ప్రభుత్వాలకు తగదని మండిపడ్డారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అరకురా నిధులతో నడుస్తున్న ఉన్న మాడని ఎత్తివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధిక మంది ఆదివాసులు ఉన్నప్పటికీ ఆదివాసుల యొక్క హక్కులను ఈనాటి కూడా కాల రాయబడుతుందని ఆదివాసులకు ఐటిడిఏ ఏర్పాటు చేయాలని, ఈ జిల్లాలో వెంటనే డి టీడీవో ఆఫీస్ని ఏర్పాటు చేయాలని, 60 శాతం వున్న నాన్ షెడ్యూలు గ్రామాలను గుర్తించి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో కలపాలని, సాగులో ఉన్న ఆదివాసి రైతులకు పోడుపట్టాలి ఇవ్వాలని పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని, ఆర్ ఓ ఎఫ్ పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని, ఎస్టీ జాబితాలో నాయకపోడు తెగకు ప్రత్యేక నెంబర్ కేటాయించి గెజిట్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించక పోవడం కారణంగా ఆదివాసుల యొక్క మేధావులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొనక ఆదివాసి సమాజం నష్టం జరుగుతుందని, ఈ దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు, ఈ సమస్యల మీద సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాలని హెచ్చరించారు, ప్రభుత్వాలకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆదివాసులతో ఏ సమస్యలతో బాధపడుతున్నారో గుర్తించి పరిష్కరించాలని లేనియెడల ఆదివాసి పేద ప్రజల సంక్షేమం కన్నా సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న సాహజ సంపదని తాకట్టు పెట్టడమే అవుతుందని వారు గుర్తు చేసారు
ఈ కార్యక్రమానికి ఐటీడీఏ ఏటూరు నాగారం ప్రధాన అధికారి ఏటిడబ్ల్యూఓ దేశిరాం నాయక్, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు బద్దీ సమ్మయ్య,మడే కుమార స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోరిగే కిరణ్, నాయకపోడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఒళ్లల మల్లేష్, రాష్ట్ర కార్యదర్శి రామీనేని సురేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటీ మల్లయ్య, సుంకరి మల్లేష్ కుదిమేత చిన్న సమ్మయ్య దొర, జయశంకర్ జిల్లా నాయకపోడు సేవ సంఘం గౌరవ అధ్యక్షులు ముజం సారయ్య, ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య, ప్రధాన కార్యదర్శి గంట శేఖర్, జయశంకర్ జిల్లా జేఏసీ చైర్మన్ గురిసింగ బాపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ భీముని సారయ్య, జయశంకర్ జిల్లా అధ్యక్షులు సూధుల శంకర్, నాయకపొడు విద్యార్థి సంఘ నాయకులు కాల్నేనీ దేవేందర్, కాటారం సబ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోట అశోక్, ఎంపీటీసీ బొడ్డు సమ్మయ్య, యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గన్నారు.