పసరలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

World Breastfeeding Week celebrations in Pasaraనవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో బుధవారం తాడ్వాయి ప్రాజెక్టులోని పస్రా సెక్టార్లో పసర గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా  నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శారద తల్లులందరినీ ఉద్దేశించి పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలని సూచించనైనది తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు కలిగే లాభాలు మరియు తల్లికి కలిగే లాభాలను వివరించి చెప్పడం జరిగినది తల్లిపాలలో వ్యాధి నిరోధకత కలిగి ఉంటాయని సూచించనైనది తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము గర్భాశయ కాన్సర్లు రాకుండా అరికట్టవచ్చు తల్లిపాలు బిడ్డకు తేలికగా జీర్ణం అవుతాయని తల్లిపాలు తప్ప ఏ ఇతర పదార్థాలు ఆరు నెలల వరకు ఇవ్వకూడదని సూచించనైనది తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది తల్లిపాలు త్రాగే బిడ్డలు ఆరోగ్యం వంతంగా యాక్టివ్ గా ఉంటారని సూచించనైనది  ఈ కార్యక్రమంలో ఈవో  శరత్ , వివో అధ్యక్షురాలు  పూలమ్మ, కారోబార్ శ్వేత అంగన్వాడీ టీచర్స్ పద్మారాణి ,భాగ్యమ్మ, పద్మావతి, సరిత ,సునీత, రమాదేవి, జ్యోతి ఊర్మిల తార బాయి, సుశీల, రజిత ,మరియు ఆశ వర్కర్లు ఎస్ ఎస్ జి మెంబర్స్ గర్భిణీలు,తల్లులు పాల్గొన్నారు.