– ఐదు దశల్లో భారత్ మ్యాచ్‌ల టికెట్లు
న్యూఢిల్లీ: 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తొమ్మిది మ్యాచులను రీ షెడ్యూల్ చేసిన ఐసీసీ, బీసీసీఐ.. అభిమానులు ఎదురుచూ స్తున్న టికెట్ల అమ్మకాల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5న వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్ జరుగనుండగా.. సరిగ్గా 41 రోజుల ముందు టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భారత్ మినహా ఇతర జట్ల మ్యాచుల (వార్మప్, మెయిన్) టికెట్లు ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇక భారత్ మ్యాచుల టికెట్లు ఐదు దశల్లో వెబ్సైట్లో ఉంచనున్నారు. ఆగస్టు 30న వార్మప్ మ్యాచులు (గువహటి, తిరువనంతపురం), 31న ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచుల టికెట్లు.. సెప్టెంబర్ 1న న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో మ్యాచుల టికెట్లు.. 2న దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ టికెట్లు.. 3న పాకిస్థాన్‌తో మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టనున్నారు. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ టికెట్లు సెప్టెంబర్ 15 నుంచి అభిమానులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఐసీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.