ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణ దినోత్సవం

నవతెలంగాణ – కంటేశ్వర్
ఈరోజు నిజామాబాద్ లో గల గాంధీ గంజ్ లో ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణ దినోత్సవం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి టి నాయక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావర్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి 2018లో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రత డేగ పాటించాలని ప్రకటించింది దానిలో భాగంగా ఆహార భద్రతపై ప్రజలకు సంస్థలకు అవగాహన కల్పించడం కోసం అపరిశుభ్రత కలుషిత హారం వల్ల సంభవించే వ్యాధుల నివారణ సురక్షిత ఆహారం వంటి అంశాలపై ప్రత్యేకంగా ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టడం జరిగింది అన్ని రాజేశ్వర్ తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజున ఫుడ్ స్టాండర్డ్స్ సేవ్ లైవ్స్ అనే నినాదంతో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని రాజేశ్వర్ తెలిపారు రాజేశ్వర్ మాట్లాడుతూ వినియోగదారులు వినియోగించే తినుబండారాల్లో తినే వస్తువుల్లో కల్తీలు జరుగుతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా కల్తీలమయం జరుగుతుందని ముఖ్యంగా పాలల్లో కల్తీ నీళ్లల్లో కల్తీ ప్రజలు వాడే పసుపు కారంపొడి రవ్వ మైదా బియ్యం ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దుకాణాలు బేకరీలు ప్రజలు వాడే నూనెలో లేనటువంటి తినుబండారాలు అమ్ముతున్నారని రాజేశ్వర్ తెలిపారు. ప్రజలు తినే పండ్లు ప లాలు కాల్షియం కార్బైడ్ తో మక్కించి అమ్ముతున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం కల్తీలు చేసే వారిపై ప్రభుత్వం ఆరు నెలల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుందని రాజేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు జిల్లాలకు కేటాయించిన ఫుడ్ సేఫ్టీ వ్యాన్ నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగిందని ఎక్కడైనా కల్తీ జరిగితే దీంతో పరీక్ష చేయించుకోవచ్చని రాజేశ్వర్ తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ టి సునీత గారు మాజీ కార్పొరేటర్ వల్లభ సా ర డా గారు శ్యామ్ తివారి గారు రంజిత్ గారు శేఖర్ గారు ఫుడ్ సేఫ్టీ సిబ్బంది వినియోగదారులు వ్యాపారస్తులు పాల్గొన్నారు.