సురభిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

– ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న డాక్టర్లు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
నేడు పెరుగుతున్న నాగరికతలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని సురభి కళాశాల మానసిక వైద్య విభాగం డాక్టర్‌ హరీష్‌ పిన్నోజి అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలో ఉన్న సురభి సైన్స్‌ అండ్‌ మెడికల్‌ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేటి ఆహారపు అలవాట్లు ధూమపానం, మద్యపానం, ఆలోచన విధానం, పనిలో ఉండే ఒత్తడి వలన కలిగే మానసిక స్థితిగతుల గురించి వివరించారు. యోగా చేయడం వలన డాక్టర్ల సలహాలు సూచనలను పాటించడం వలన మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. సురభి కళాశాలలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ సూపర్‌ అండి డాక్టర్‌ శివరామ చారి, డాక్టర్‌ రాజేష్‌, డాక్టర్‌ రఫీ, పిఆర్వో పరుశరాములు పాల్గొన్నారు.