దుబాయ్ : ఐసీసీ ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా ర్యాంకింగ్స్‌లో ఎగబాకు తుంది. ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించిన రోహిత్‌సేన.. తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. భారత్ 116 పాయింట్లతో వరల్డ్ నం.2గా నిలువగా.. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానం సొంతం చేసుకుంది. వరల్డ్ నం.1గా ఆసియా కప్‌కు వచ్చిన పాకిస్థాన్.. సూపర్4 నుంచి నిష్క్రమించి మూడో స్థానానికి పడిపోయింది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్ ఉండటంతో.. ఐసీసీ వరల్డ్‌కప్ వేట ముంగిట అగ్రజట్లు సమర సన్నద్థతతో పాటు అగ్రస్థానం కోసం పోటీపడనున్నాయి.