ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..

World Photography Day Celebrationsనవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.   కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొమ్మేన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో కళలని కనుమరుగుపోకుండా మధురమైన జ్ఞాపంగా మదిలో నిలిచిపోయే లాగా చేసేవారు. ఫోటో గ్రాఫర్ తాను తీసిన ఫోటోలు కస్టమర్ కంటే ముందు తను మురిసిపోతు ఫోటోలు తీస్తు ఆనందిస్తాడు అని అన్నారు. ఒక ఫోటోగ్రాఫర్  ఎలాంటీ పరిస్థితులో ఉన్న ఎంచుకున్న వృత్తిని నమ్ముకుని తన భుజాలపై వేసుకొని ముందుకు తీసుకుపోయేవాడు ఫోటోగ్రాఫర్ అని తెలిపారు. ఈ వృత్తిని ఎంచుకున్నందుకు చాలా గర్వాంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సందెల నరేష్ సభ్యులు గోవర్ధన్,అంజి,సుధాకర్,వేణు,నాగరాజు,విజయ్,విజయ్, శ్రీకాంత్ తదితరుల పాల్గొన్నారు.