రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన సదస్సు

నవతెలంగాణ -కంటేశ్వర్
స్థానిక గుపన్పల్లి నందుగల జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను ఏర్పాటు చేసి అలాగే అవగాహన సదస్సును నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షులు జి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లబ్ మాజీ అధ్యక్షులు, న్యాయవాది ఎల్.గోపాల్ రెడ్డి  హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచ జనాభా నిమిష నిమిషానికి పెరుగుతోంది. 2021 నాటికి 788 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా, 2023 నాటికి 800 కోట్లు దాటిందని అంచనా. ఈ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్, చైనా మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. భారత్ ఇటీవలే చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించి మొదటి స్థానంలోకి రాగా, చైనా రెండో స్థానానికి దిగింది. ప్రపంచ జనాభా లో యువత ప్రాధాన్యత చాలా ఎక్కువ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ జనాభాన్ని నియంత్రించాలని ఉద్దేశంతో ఉందని వారికి అన్ని దేశాల సహకారం కూడా అవసరమని తెలియజేశారు. తదనంతరం విద్యార్థులు ఉపన్యాసాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి డ్రాయింగ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ప్రధాన కార్యదర్శి యన్. ప్రసన్న కుమారి, కోశాధికారి ఇందూరి శ్రీనివాస్, క్లబ్ సర్వీస్ డైరెక్టర్ బాబురావు, కార్య నిర్వహణ అధికారి సాగర్ మలాని, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పి.బి.కృష్ణమూర్తి, ఆకుల అశోక్, మనోజ్ పటేల్ భరత్ పటేల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శకుంతలాదేవి సిబ్బంది ఆత్మీయులు ఆకుల సందీప్, కిరణ్ కుమారులు కూడా పాల్గొన్నారు.