ఆగస్టు 5,6 తేదీల్లో సింగపూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

– 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు :తెలుగు టెక్నోక్రాట్స్‌కు జయేశ్‌రంజన్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగపూర్‌లో ఆగస్టు 5, 6 తేదీల్లో జరగనున్న మొట్ట మొదటి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్స్‌(ఐటీ ఉద్యోగులు, సిబ్బంది) పెద్ద ఎత్తున్న హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పిలుపునిచ్చారు. దాదాపు వందకుపైగా దేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఇన్వె స్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్‌ హాజరుకానున్న ఈ మహాసభల ద్వారా ఇటు పరిశ్రమ అభివృద్ధితోపాటు అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన విస్తృత అవకాశాలు పొంద గలరని వివరించారు. మహాసభల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్స్‌కు ఆయన ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, స్వదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలతో సంబం ధం ఉన్న ఐటీ రంగ నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు వరల్డ్‌ తెలంగాణ ఐటీ కౌన్సిల్‌ (డబ్ల్యూటీఐటీసీ) సందీప్‌కుమార్‌ మఖ్తల నాయ కత్వంలో ఏర్పడింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు www.://tseamcet.nic.in లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే నివత్తి కోసం చైర్మెన్‌ సందీప్‌ మఖ్తలను 8123457575/ 8123123434 నెంబర్లలో సంప్రదించొచ్చని కోరారు.