– గ్లోబల్ బ్రాండ్‌లను షేక్ చేస్తున్న భారత విస్కీ
న్యూఢిల్లీ: భారత విస్కీ ‘ఇంద్రి’ ప్రపంచ బ్రాండ్‌లను షేక్ చేస్తున్నది. ఇటీవలే ప్రపంచలోని అత్యుత్తమ విస్కీగా దీనికి పేరు లభించిన విషయం విదితమే. దీంతో ‘ఇంద్రి’ని సేవిస్తున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. దీంతో ఈ భారత బ్రాండ్.. ఉత్పత్తిని పెంచటానికి అంతా సిద్ధమైంది. అంతేకాదు, స్పిరిట్ మార్కెట్‌లోనూ ఇది పెను మార్పులు తీసుకొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన పెర్నోడ్ రికార్డ్ తయారు చేసిన గ్లెన్‌లివెట్, బ్రిటన్‌కు చెందిన డియాజియోచేతాలిస్కర్ వంటి ప్రపంచబ్రాండ్‌లకు, ఇంద్రి, అమృత్ వంటి దేశీయ బ్రాండ్లకు మధ్య పోటీ నెలకొన్నదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.