ఉప్మా రవ్వలో పురుగులు

Worms in Upma Rava– సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన ఉప్మా రవ్వలో పురుగులు

నవతెలంగాణ-రాయికల్
పట్టణంలోని శ్రీరామ సూపర్ మార్కెట్ లో ఈనెల 14వ తేదీన కొనుగోలు చేసిన ఉప్మా రవ్వలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి… గతంలో ఓసారి ఇలాగే జరిగిందని ఓ వినియోగదారుడు సంబంధిత సూపర్ మార్కెట్ కి వెళ్లి తెలుపగా.. తిరిగి తీసుకొని వేరే ప్యాకెట్ ఇచ్చారు. మళ్లీ అలాగే ఉప్మా రవ్వలో పురుగులు రావడంతో వినియోగదారుడు కంగుతిన్నాడు. విషయం తెలిపేందుకు వినియోగదారుడు సంబంధిత సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించలేదు.ఈ విషయంపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సూపర్ మార్కెట్లో సరుకులను విక్రయిస్తున్న యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు కోరుతున్నాడు.