ములుగు జిల్లా తాడ్వాయి మండలం బైయక్కపేట గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదల కు అన్ని కష్టాలే. డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో రోడ్డు లేక వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ సరిగా లేక, ఇంటి చుట్టు నీరు గుంతలు పిచ్చి మొక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడుతూ రోగాల బారిన పడుతున్నారు. ఇండ్లలో చుట్టూ పరిసరాలు బాగోలేక ఇండ్ల మధ్యలో ఉన్న రోడ్లన్నీ బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బైక్ పేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో రహదారులను, సీసీ రోడ్లు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.