
ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భమున బోర్గాం (పి) గ్రామ శివారులోనీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆది గురువులు జగద్గురువు శ్రీ శంకరాచార్య కి అలాగే శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి కి, శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి మహాస్వామి వారల పాదుకలకు లక్ష్మీ గణపతి మహా ఆలయంలో పంచామృత అభిషేకములు విశేష నామార్చనలు హారతి మంత్రపుష్పము చేయడం జరిగింది. జగద్గురువుల వారి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని గ్రామాలలో పాడి పంటల అభివృద్ధి చెందాలని అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలని గురువుల పాదపద్మముల దగ్గర విన్నవించడం జరిగినది.