రంగనాథ స్వామి దేవాలయంలో పూజలు

– పాల్గొన్న గచ్చిబౌలి కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి దంపతులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగం పల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్‌ పరి ధిలోని గోపన్‌పల్లి గ్రామంలోనీ శ్రీ రంగ నాథ స్వామి దేవాలయంలో గచ్చిబౌలి డివిజన్‌ కార్పొ రేటర్‌ గంగాధర్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కుటుంబ సభ్యులకు దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు. ఈ సం దర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లా డుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనం దంగా ఉందన్నారు. నూతన ఏడాదిలో ప్రజలందరూ సు ఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ప్ర జా సేవలో ముందుకెళ్తున్నానని తెలిపారు. ఈ కార్య క్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సీనియర్‌ నాయ కులు, డివిజన్‌ నాయకులు, బీజేపీ శ్రేణులు, స్థానిక నేత లు కార్యకర్తలు పాల్గొన్నారు.