ఆలయంలో పూజలు

నవతెలంగాణ – నిజామాబాద్
జిల్లా కేంద్రంలో 36వ డివిజన్ అంబేద్కర్ కాలనీ లో శ్రీ సాయి కేసరి వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా హనుమంతునికి అభిషేకాలు అర్చనలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి శివరాజ్ గౌడ్, సలహాదారులు యాదయ్య అరుణ్ బాబు సహదేవ్, కార్యదర్శులు చిన్న సత్యం రాజేష్,ప్రసాద్ బాబూరావు మరియు కాలనీవాసులు భక్తులు పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ప్రార్థనలు చేశారు.