నవతెలంగాణ-కోట్‌పల్లి
కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్ గ్రామంలో వీర శివాజీ యూత్ గణేష్ వద్ద సోమవారం రాత్రి కొత్తపల్లి జగన్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కుమారులు మహేందర్ రెడ్డి, రామకష్ణారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సంగారెడ్డి, కష్ణారెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, రాజు, సురేష్, మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.