వర్షాలు కురువాలని వరుణుడికి పూజలు

నవతెలంగాణ-వీణవంక
వర్షాలు కురువాలని మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామస్తలు శనివారం వరుణదేవుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడుతూ గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తలు మాట్లాడుతూ వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా..  వానలు కురవకపోవడంతో రైతాంగానికి తీవ్ర ఇబ్బందులవుతున్నాయని వాపోయారు. ఈ నేపథ్యంలో పూర్వ కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం కప్పతల్లి ఆట ఆడి వరుణ దేవుడికి వానలు కురువాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తలు సార్ల సుధాకర్, పోతరాజు భాస్కర్, యార కుమారస్వామి, అప్పని ఐలయ్య, అప్పని కుమారస్వామి, ఎజ్జు మొగిళి, అమ్మ బాలయ్య, ఎజ్జు వెంకట్రాజం, యార రాజయ్య, అప్పని హరీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.