వైభవంగా వరలక్ష్మీ పూజలు

Worship Varalakshmi with splendorనవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా పాఠశాలలో  శుక్రవారం వరలక్ష్మీ వ్రతంను వైభవంగా జరుపుకున్నారు. పాఠశాలలో లక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన పండ్లు, పువ్వులు, పిండి వంటకాలు పెట్టి పూజించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్ డైరెక్టర్ పోతన్న యాదవ్, బీమ్ రావు దేశాయ్, ఉపాధ్యాయురాలు, విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.